Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
ఆదివారం పట్టణంలోని న్యూ ఇండియా చర్చ్ ఆఫ్ గాడ్ మందిరంలో రెవరెండ్ పాస్టర్ ఇమ్మడి ఆంద్రయ్య అధ్యక్షతన సావిత్రిబాయి పూలే క్రాంతి జ్యోతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వృద్ద, మహిళలు, వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైర్టెర్ ఐత ప్రవీణ్ మాట్లాడుతూ.. సంస్థ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ రజినిరుద్రమ సహకారంతో రానున్న క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు కొండేటి కుమారస్వామి, సిలివేరు ఆనందం, కొండేటి వెంకన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు.