Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
వరంగల్ నగరంలోని ప్రభుత్వ స్థలాలు, పార్కులను పరిరక్షించాలని ఆదివారం వాకర్స్ ఇంటర్నేషనల్ 303 ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నయీమ్ నగర్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు వారు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ రీజనల్ కౌన్సిలర్ దేశిని లక్ష్మి నారాయణ, గవర్నర్ తడక. కుమారస్వామి గౌడ్లు మాట్లాడారు. నగరంలోని పార్కులు, ప్రభుత్వ స్థలాలు అక్రమణకు గురవుతున్నాయన్నారు. వాటిని రక్షించి, అభివద్ధి చేయాలని కోరారు. పార్కులలో ఉదయం సమయంలో ప్రవేశ రుసుమును వాకర్స్‌కు మినహాయించాలని అధికారులను కోరారు. అనంతరం వాకర్స్ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 303 ప్రతినిధులు జంగా .గోపాల రెడ్డి, నరసింహా రావు, మార్త. రాజయ్య, కూచన రాజు, శ్రీధర్ రావు, నగరంలోని వాకర్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.