Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
కల్మషం లేని స్నేహ బంధంతో బాల్యంలో చేసిన చిలిపి చేష్టల గుర్తులు పరిమళించాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 1998-99బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 22సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలో చదివిన రోజులను, మధుర స్మతులను ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. ఒకరికొకరు కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అఫ్సర్ పాషా, సొడేపు శ్రీనివాస్, మచ్చ రమేష్, మహమ్మద్ రఫీ, మచ్చ రాజు, కుంట ప్రభాకర్, ఈజ్జగిరి రాజు, మహమ్మద్ కలీం, చిన్నాల రాజు, మహమ్మద్ అజారుద్దీన్, సర్వర్,యూసుఫ్, మొహీన్, మహబూబ్ పాషా, మన్సూర్, బీరెల్లి బాబు, మచ్చ అశోక్, వేముల రమేష్, ఏ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.