Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
వికలాంగులను ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధిస్తారని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ బన్న అయిలయ్య అన్నారు. ఆదివారం విద్య ఫౌండేషన్, సాయి శివాని వొకేషనల్ కల్చరల్, దివ్యాంగుల సామాజిక వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని' పురస్కరించుకొని వికలాంగులకు నిర్వహించిన పోటీల విజేతలకు సర్క్టూట్ గెస్ట్హౌజ్లోని బియ్యాల జనార్థన్ కమ్యూనిటిహాల్లో బహుమతులు ప్రదానం చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బిల్ల మహేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆయనతో పాటుగా కడియం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కావ్య, జిల్లా సంక్షేమాధికారి సబితలు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో దివ్యాంగుల కళలను వెలికి తీయడం గొప్ప విషయమని, వారిలో స్ఫూర్తి నింపే కార్యక్రమాలను నిర్వహిస్తున్న మహేందర్ కషిని అభినందించారు. కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన దివ్యాంగ కళాకారులు వారి కళానైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. విజేతలకు వారు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాయి శివాని, పద్మజాదేవి, విజయలక్ష్మి, రాఖి, శోభ, సరస్వతి, రాములు, కొల్లు నరసమ్మ, గురిజాల తిరుపతి రెడ్డి, కొక్కుల కష్ణ, కల కోట్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.