Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబుల్ ఇండ్ల జాడేది..?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
వర్గ సభ్యులు తక్కళ్లపల్లి
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ నగర సమగ్రాభివద్ది కోసం ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం 12వ డివిజన్ కెేఎల్ మహేంద్ర నగర్ శాఖ సీపీఐ మహాసభ సండ్ర కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. నగరాభివద్ధి కోసం పాలకులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పేదల ఇండ్లకు పట్టాలు రాలేదని, డబుల్ బెడ్రూం ఇండ్లు కలగానే మిగిలిపోయాయని మండి పడ్డారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు తీసుకురావాలని పోరాటాలు నిర్వహించినా ప్రభుత్వాలు స్పందించడం లేదని వాపోయారు. కాజీపేటు కోచ్ ఫ్యాక్టరీ రాలేదని, ఉన్న పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలి స్తున్నారని, కాకతీయ మెగా టెక్స్ టైల్ పరిశ్రమ ప్రారంభించి ఏండ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదన్నారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రి అభివద్ధికి నోచుకోవడం లేదన్నారు. నిప ుణులైన డాక్టర్ లను, అత్యాధునిక పరికరాలను సమకూ ర్చాలన్నారు. వరంగల్ నగరంలో పేదల ఇండ్ల స్థలాల కోసం సీపీఐ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో భూ పోరాటాలు నిర్వహించాలన్నారు. వరంగల్ నగరాభివద్ధి కోసం ఉద్యమాలను నిర్వహించాలన్నారు. ఈ మహాసభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా నాయకులు తోట బిక్షపతి, షేక్ బాష్ మియా, బుస్సా రవిందర్ పాల్గొన్నారు.