Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
కరోనా నుంచి రక్షణ కోసం ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లయన్ డాక్టర్ ఆకారపు రాజగోపాల్ తెలిపారు. ఆదివారం వెంకటాపురంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ ఆధ్వర్యంలో మాధవ హాస్పిటల్, శంభునిపేట వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు రెండు వందల మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మాస్కులను సైతం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గోకే రేణుక శ్రీనివాస్, కలవాల సతీష్, మినుముల రాజు, వెంకటస్వామి, అజరు, రజనీకాంత్, పీఈటీ రాజు, ల్యాబ్ టెక్నీషియన్ వంశీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.