Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్
నవతెలంగాణ-కాజీపేట.
రాష్ట్రంలోని ఇంక్లూసీవ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్(ఐఈఆర్పీ)ల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కషి చేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్ తెలిపారు. స్థానిక పారడైస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం 'దివ్యంగా పిల్లల విద్యా సౌకర్యం ఐఈఆర్పీల పాత్ర' అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు ను టీఎస్ పీఆర్టీయూ, ఐఈఆర్పీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిలివేరి వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఈఆర్పీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. వికలాంగ పిల్లలకు విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసేందుకు కృషి చేస్తానన్నారు. వికలాంగుల విద్యాభివద్ధి కోసం ఐఈఆర్పీలు చేస్తున్న కషి అభినందనీయమన్నారు.
ఐఈఆర్పీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ మాట్లాడుతూ.. వికలాంగ విద్యార్థులకు ప్రత్యేక విద్యను బోధిస్తూ, వారి తల్లిదండ్రులలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్న ఐఈఆర్పీలను అభినందించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు నమోదైన పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికన నియమించేలా కషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ, ఐఈఆర్పీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిలివేరు వెంకటేష్‌లు మాట్లాడారు. 21ఏండ్లుగా సమగ్ర శిక్షణ నందు విధులు నిర్వహిస్తున్న ఐఈఆర్పీలను విద్యాశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఉద్యోగుల జాతీయ అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, కార్పొరేటర్ సంకు నర్సింగరావు పాల్గొన్నారు.