Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
బాల్యవివాహాలు, బాల కార్మికులు, బడి మానేసిన పిల్లలకు గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటేే చైల్డ్‌లైన్ 1098 టోల్‌ఫ్రీ ద్వారా ఫిర్యాదు చేయొ చ్చని జిల్లా కోఆర్డినేటర్ తప్పట్ల వెంకటేశ్ అన్నారు. సోమవారం మండలం లోని దామరవంచ గ్రామ ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో డీఓపెన్ హౌజ్ సమావేశం చైల్డ్‌లైన్ 1098 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంద్బంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాలలందరూ చైల్డ్‌లైన్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. సర్పంచ్ కొమ్మాలు, ఎంపీటీసీ స్వాతి, కార్యదర్శి రాజోద్దీన్, అంగన్వాడీ సూపర్వైజర్స్్ రాజేశ్వరి, చైల్డ్‌లైన్ ప్రతినిధులు అనిల్, ప్రదీప్, ప్రధానోపాధ్యలు హరిసింగ్ పాల్గొన్నారు.