Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జెడ్పీ చైర్పర్సన్ బిందునాయక్
నవతెలంగాణ-బయ్యారం
ఏజెన్సీ ప్రాంతంలో క్రీడలు నిర్వహించడం అభినందనీయమని మహబూ బాబాద్ జెడ్పీ చైర్పర్సన్ బిందు నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధి కోయగూడెం గ్రామపంచాయతీ సుద్దరేవు గ్రామంలో కోయగూడెం గ్రామపంచాయతీ కబడ్డీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు.బక్రీడలు దేహదారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. రాష్ట్రప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నదని, ఏజెన్సీలో క్రీడలను ఐటిడిఏ పోత్సహిస్తున్నదని అన్నారు. యువత క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, సర్పంచ్‌లు మణెమ్మ, చింత వెంకటరమణ, పోలెబోయిన వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ ఆరేం నాగేశ్వరావు, టీఆర్ఎస్ నాయకులు నీలమయ్య, కబడ్డీ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.