Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండల కేంద్రంలో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కార్పోరేట్ లిమిటెడ్ గూడూరులో బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఇందులో మండల కేంద్రానికి చెందిన పలువురు బాధితులు సేవింగ్ డిపాజిట్స్ చేశారు. ఇటీవల బ్యాంకు మూసివేశారు. దీంతో బాధితులు సోమవారం గూడురు పోలిస్స్టేషన్లో ఎస్సై సతీష్‌కు ముద్ర సొసైటీపై ఫిర్యాదు చేశారు. యాజమాన్యం నుండి బాధితులందరికీ తగిన న్యాయం చేయాలని కరోరారు. లక్షలాది రూపాయలు సేవింగ్స్ డిపాజిట్ చేస్తే యాజమాన్యం బోర్డు తిప్పేసే ప్రయత్నం చేస్తుందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.