Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
40 ఏండ్లుగా మహబూబా బాద్ పట్టణంలో 40మంది కిరోసిన్ హాకర్స్ లైసెన్స్ పొంది ఇంటింటికీ కిరోసిన్ పోసి సేవలందించామని, కిరోసిన్ కోటా నిలిపేయడంతో ఇబ్బందులు పడుతున్నామని, తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. సోమవారం మహబూబాబాద్ కిరోసిన్ హాకర్స్ సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లో నర్సంపేట బైపాసు రోడ్ నుండి తహసీల్ధార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు డిప్యూటీ తహసీల్ధార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మున్పిపల్ ప్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి బీఎస్పీ మహబూబాబాద్ నియోజక వర్గ నాయకులు ఉపేందర్ వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. నాల్గు దశాబ్దాలుగా సేవలందించిన వారిని రేషన్ డీలర్ షిప్ ద్వారా గాని ఆర్ధిక సహాయం చేసి గాని, ఉద్యోగం ఇచ్చి గాని ఆదుకోవాలన్నారు. వారి పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతు ఇస్తుందని తెలిపారు.