Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య
నవతెలంగా-భూపాలపల్లి
విద్యార్థుల ఆరోగ్యం దేశానికి వరమని డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ మాడల్ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాస , డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్ల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఎయిడ్స్ గురించి మాట్లాడడం తప్పు కాదని, ఎయిడ్స్‌కు చికిత్స కన్నా నివారణ ముఖ్యమని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల, వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు విద్యతోపాటు ఇతర విషయాల్లో శాస్త్రీయ అవగాహనతో ఉండాలన్నారు. అవసరం మేరకే ఇంటర్ నెట్, ఫోన్ వినియోగించాలన్నారు. బాలికలు చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారని, పోషకాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శేఖర్, మాస్ మీడియా ఆఫీసర్ అన్వర్, ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ ప్రసన్‌కుమార్, సీహెచ్ఓ విద్యాసాగర్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర రాజు, సీనియర్ అసిస్టెంట్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.