Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండి నరసింహారావు
నవతెలంగాణ- మహబూబాబాద్
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317 సవరించి ఉపాధ్యాయ ఉద్యోగుల స్థానిక చేరుస్తూ సీనియారిటీని చూడాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండి నరసింహా రావు డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్‌యుటిఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మురళి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 317 లో ఉద్యోగి స్వస్థలం చేర్చకుండా ఇవ్వాలని, సర్వీస్ ఆధారంగా సీనియార్టీ ప్రకటిస్తే స్థానిక జిల్లాను వదిలి మరో జిల్లాకు వెళితే రిటైర్ అయ్యే వరకు ఉపాధ్యాయులు అదే జిల్లాలో కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. జీవోను సవరించి స్వస్థలానికి చేరుస్తూ సీనియారిటీని ప్రకటించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, యాకూబ్, రమేష్, కళ్యాణ్, నాగమల్లయ్య, వెంకటేశ్వర్లు, బద్రు నాయక్ వీరస్వామి లింగనాయక్, లింగారావు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.