Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
అంగన్వాడీ సేవల్లో స్మార్ట్పోన్ల వినియోగంతో మరింత పారదర్శకత ఉంటుందని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి అన్నారు. సోమవారం బచ్చన్నపేట మండల పరిధి అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను జనగామ జెడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మీ, ఎపీపీ భావండ్ల నాగజ్యోతి తో కలిసి ఆయన పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అభియాన్ పథకం ద్వారా స్మార్ట్ ఫోన్లో పోషన్ ట్రాక్టర్ యాప్ సహాయంతో గర్భిణులు, బాలింతలు, పిల్లల వివరాలు, అక్షరాభ్యాసం, శ్రీమంతాలు, ప్రీ స్కూల్ విద్యా అంగన్వాడీ టీచర్ల రోజువారీ కార్యకలాపాలు నిక్షిప్తం చేయ నున్నట్టు తెలిపారు. గ్రామాల్లో మాత శిశువులకు, గర్భిణులకు మరిన్నిసేవలు అందించేందుకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ అనుసంధానం కల్గిన స్మార్ట్ పోన్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్, ఎంపీడీఓ జి శివ, ఎంపీటీసీ వేణు, ఈవోపీఆర్డీ రఘు రామకష్ణ, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు.