Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని రామ్సింగ్తండా గ్రామపంచాయతీ పరిధి చర్లతండాలో నిరుపయోగంగా ఉన్న సబ్ సెంటర్లో త్వరలో వైద్యసేవలు అందిస్తామని మహబూబాద్ జిల్లా డీిఎంహెచ్ఓ హరీష్రాజ్ అన్నారు. సోమవారం సబ్సెంటర్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. మండలంలోని నీలవేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి చర్ల తండలో కొన్ని సంవత్సరాల క్రితం ఐటీడీఏ నిధుల నుండి నూతన భవనం నిర్మించారని తెలిపారు. నాటి నుండి నేటి వరకు అది నిరుపయోగంగా ఉందని, తాత్కాలిక పనులు ఐటీడీఏ నిధుల ద్వారా పూర్తి చేసి త్వరలో గిరిజనులకు వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. స్థానిక సబ్ సెంటర్లో వైద్య సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాంసింగ్తండ సర్పంచ్ మంగీలాల్, తీగల వేణి వైద్యాధికారి విక్రమ్ కుమార్, ఏఎన్ఎంలు కవిత రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.