Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆందోళన
నవతెలంగాణ-గణపురం
బెల్టుషాపుల కోసం రెండు ఆటోల్లో మద్యాన్ని తరలిస్తుండగా సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు, కర్కపల్లి సర్పంచ్ పొట్ల నగేష్ ఆధ్వర్యంలో మద్యాన్ని పట్టుకొని గ్రామస్తులతో ఆందోళన చేశారు. సోమవారం గణపురం చేల్పూర్కు చెందిన వైన్‌షాపు యజమానులు రెండు ఆటోల్లో మద్యాన్ని బెల్టు షాపులకు పంపించారు. దీంతో సర్పంచ్ పొట్ల నగేష్ తమ గ్రామంలో బెల్టుషాపులు నడపొద్దని, గ్రామానికి మద్యాన్ని తీసుకురావొద్దని ఆటోలను గ్రామస్థులతో కలిసి పట్టుకున్నారు. మరోసారి మద్యంను తీసుకొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం పట్టుకున్న మద్యాన్ని పోలీసులకు అప్పగించారు. గణపురం చెల్పూర్ వైన్‌షాపు యజమానులు ఎమ్ఆర్పి రేటుకు మించి మద్యం విక్రయిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు.