Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని మైనింగ్ ఏడీ, ప్రత్యేకాధికారి రామాచారి అన్నారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసుకోని వారెవరైనా ఉంటే వెంటనే వేసుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామంలో వ్యాక్సిన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొంగరి రవి, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి ఎంపీఓ మహబూబ్ అలీ, కార్యదర్శి సదానందం, ఈసీ కిరణ్ పాల్గొన్నారు.