Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించా లని సంబంధితశాఖల అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యా లయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. కాటారం మండల కేంద్రానికి చెందిన కొండకర్ల పోచక్క, సరిత ఏడాది కిందట మరుగుదొడ్లు, నిర్మిం చుకున్నామని, కాటారం మండల కేంద్రానికి చెందిన గంట మహేష్, భౌతు సారక్క, తిరుపతమ్మ ఇంకుడు గుంతలు నిర్మించుకున్నామని బిల్లులు ఇప్పించాలని కోరారు. నెలల తరబడి మధ్యాహ్న భోజన బిల్లులు, జీతాలు చెల్లించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకుల తరఫున ఏఐటీయూసీ సంఘం, సర్పంచ్ గ్రామ పంచాయితీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని అతనిపై చర్య తీసుకోవాలని మాహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామం వార్డు మెంబర్లు దరఖాస్తు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్. దివాకర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రతి దరఖాస్తుకు స్పందించాలి
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రతి ప్రజావాణి దరఖాస్తుకు తప్పనిసరి స్పందించి సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని ప్రగతి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో 52 దరఖాస్తులు స్వీకరించారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం కోల్పోయిన బానోతు వినరు పుట్టుకతోనే మూగ వాడని, రెండు నెలల నుండి పింఛన్ రావడం లేదని చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు బానోతు బద్రు అనిత కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కేసముద్రం మండలానికి చెందిన వికలాం గులు కిష్టాపురం గ్రామానికి చెందిన నిమ్మరబోయిన యకమ్మ బ్యాటరీ సైకిల్ కావాలనిదరఖాస్తులు అందించారు. వీరితో పాటు పలువురు దరఖాస్తులు అందజేశారు. ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ కొమరయ్య, జెడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, తదితరులు పాల్గొన్నారు.