Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మహిళలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి కల్యాణి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ధర్మారావు, సూపర్ వైజర్ కల్పన ఆధ్వర్యంలో మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ పక్షోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడారు. స్త్రీలపై ఏదైనా హింస జరిగినపుడు మానసికంగా కుంగిపోకుండా దృఢంగా ఉండి మానసిక, ఆలోచన శక్తిని పెంపొందించు కోవాలన్నారు. ఆపద సమయంలో 100,181,112,1098,14567 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారమివ్వాలన్నారు. గృహ హింస, లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫిసర్ వెంకటస్వామి,హెల్త్ అసిస్టెంట్ భిక్షపతి, ఏఎన్ఎం శ్రీలత, మహిళా శక్తి కేంద్రం కో ఆర్డినేటర్ అనూష, స్కిల్ డెవలప్మెంట్ వర్కర్ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.