Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
నానమ్మ మందలించిందని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై గుర్రం ఉదరు కిరణ్ కథనం ప్రకారం సీతారాంపురం గ్రామానికి చెందిన గుర్రం మణికుమార్(10) తండ్రి చనిపోవడంతో నానమ్మ ఇంట్లో ఉంటూ ఐదవ తరగతి చదువుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం టీవీ రీఛార్జి కోసం నానమ్మను డబ్బులు అడగగా ఆమె ఇవ్వలేదు. దీంతో మనస్థాపానికి గురై పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేస దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.