Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్నామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని వ్యవసాయాధికారి నిర్మల కోరారు. మంగళవారం మండలంలోని బూర్గులతండా గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రోజా నాగునాయక్, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, వార్డు సభ్యులు, రైతులు గోవిందు, శంకర్, సైదమ్మ, హతిరాం, మాలు బిక్షం తదితరులు పాల్గొన్నారు.