Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యాదగిరిరావు
నవతెలంగాణ - తుంగతుర్తి
ఈ నెల 21, 22 తేదీల్లో హుజూర్నగర్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు పిలుపుని చ్చారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలపై మరింత భారాలు వేయడం సరికాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తుందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏమైందని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, చెరుకు యాకలక్ష్మి, పల్లా సుదర్శన్, గడ్డం ఎల్లయ్య, ముత్తయ్య, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.