Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు తమ తండ్రి గుడిపాటి పకీర్ జ్ఞాపకార్థం గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో ఉన్న విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లి గుడిపాటి కమలమ్మ, సర్పంచ్ మామిడి వెంకన్న, ఎంపీటీసీ మట్టిపెళ్లి కవితాకుమార్, ఉప సర్పంచ్ మోదాల పరమేష్, మల్లెపాక రాములు, గుడిపాటి కమలాకర్, అంగన్వాడీ టీచర్లు అమృత, మంజుల, గాంధమ్మ తదితరులు పాల్గొన్నారు.