Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిలుకూరు
దేశానికి వామపక్ష ప్రజాతంత్ర శక్తులే రక్షణ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకల పల్లి రాములు అన్నారు. మంగళవారం మండలంలోని బేతవోలు గ్రామంలో నిర్వహించిన పార్టీ 7వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలైన విమానయాన, బొగ్గు, రైల్వే, బీఎస్ఎన్ఎల్ రంగాలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అమ్మేందుకు కుట్ర పన్నుతుందన్నారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికీ ప్రభుత్వాలు స్పష్టమైన విధానం ప్రకటించలేదన్నారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శిగా నాగాటి చిన్న రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు, జే.నరసింహారావు, మెట్ట గన్ను పూల ముత్యాలు, వేనేపల్లి వెంకటేశ్వరరావు, పటాన్ మైబెల్లి, బుడగం రామారావు, బత్తిని వెంకటయ్య, పిల్లి వీరమల్లు, వై.లింగయ్య తదితరులు పాల్గొన్నారు.