Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
ప్రభుత్వం అంగన్వాడీ సేవలు విస్తతం చేసేందుకు స్మార్ట్ఫోన్లను అందించిందని, వాటినిసద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ మల్లీశ్వరి తెలిపారు. మండల కేంద్రంలోని సీడీపీఓ కార్యాలయంలో గోవిందరావుపేట, తాడ్వాయి మండలంలోని ఐదు సెక్టార్లలోని 124 అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు 124 స్మార్ట్ సెల్ ఫోన్లు, ఐదు సెక్టార్లలో ఐదుగురు సూపర్జపర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామాల పరిధిలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేస్తున్న సేవలు గొప్పవన్నారు. ముఖ్యంగా పేదింటి మహిళలకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు బాలింతలకు పరిష్కారం అందిస్తున్నామని తెలిపారు. పాలు, గుడ్డుతో కూడిన మంచి బలవర్థకమైన ఆహారం అందిస్తున్నామని, అలాగే చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి బాలామతం అందిస్తున్నామని చెప్పారు. గర్భిణీలు, పిల్లలకు టీకాలు అందజేయడం, కరుణ వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా లబ్ధిదారుల వివరాలు వారికి అందించే సేవలను తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు పద్మ, రమ, కళావతి, తాడ్వాయి, గోవిందరావుపేట మండలలోని అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.