Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
బాలికలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని జెడ్పీటీసీ పిట్టల శ్రీలత అన్నారు. ముప్పారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన బేటి బచావో బేటి పడావో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ మహిళ శిశు సంక్షేమ, శాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ పిట్టల శ్రీలత సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. బాలికలు జీవిత ఆశయాన్ని నిర్దేశించుకుని, సక్రమమైన మార్గంలో నడవాలని కోరారు. ఉన్నతంగా ఆలోచించి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలను, ఉన్నతమైన పదవులను పొంది, కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవిత, స్థానిక ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్, సర్పంచ్ సమ్మక్క, రాజయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడబ్ల్యూసీ సభ్యురాలు దామోదర్, ఐసీపీఎస్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.