Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటమే లక్ష్యంగా ఈనెల 20, 21 తేదీల్లో పట్టణంలోని సత్తార్ మియానగర్లో తలపెట్టిన సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను పురస్కరించుకొని 20న తలపెట్టిన బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలి రావాలని ఆ పార్టీ మండల నాయకులు వంగూరి వెంకటేశ్వర్లు, చింత ఎల్లయ్య, మల్లెల నాగమణి కోరారు. జిల్లా మహాసభల వాల్పోస్టర్ను మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామ శాఖ అధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ ప్రజాపోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీగా వివరించారు. సభకు రైతులు, కూలీలు, అసంఘటిత రంగా కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మేథవులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వెంకన్న, బాల, కొండయ్య, డీవీ, వీరభద్రం, సీతారాం, నరేష్, శ్రీను, రాంబాబు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.