Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం సమగ్ర అభివద్ధి చెందుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి, నెల్లికుదురు, రామన్నగూడెం, సోమ్లాతండాల్లో మంగళవారం ఆయా గ్రామాల సర్పంచ్లఉ చింతకుంట్ల యాకన్న, బీరవెల్లి యాదగిరిరెడ్డి, కాశమల్ల పద్మ, ధరంసోత్ మంగ్యా ఆధ్వర్యంలో మంగళవారం 'మన ఊరు-మన ఎమ్మెల్యే' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేలా 25 శాఖల అధికారులతో కలిసి 'మన ఊరు-మన ఎమ్మెల్యే' కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు, కనీస సదుపాయాలు, పింఛన్లు, తదితర ఎలాంటి సమస్యలున్నా ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులతో కలిసి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. అలాగే గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి సీడీఎఫ్ నిధులు కేటాయిస్తామని చెప్పారు. గ్రామాల్లో లింక్ రోడ్ల నిర్మాణానికి నివేదిక ఇవ్వాలని పీఆర్ ఏఈని ఆదేశించారు. విద్యుత్, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారులకు వివరిస్తామని చెప్పారు. అలాగే పంచాయతీ భవనాల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు, రైతు సమన్వయ సమితి జిల్లా మండల కోఆర్డినేటర్లు బాలాజీ నాయక్, కాసం వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కసరబోయిన విజరు యాదవ్, పీఏసీఎస్ చైర్మెన్ గుండా వెంకన్న, కాసం లక్ష్మి చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లు మురళి, పాశం రమేష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పరిపాటి వెంకట్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు రెహ్మాన్, తహసీల్దార్ సయ్యద్ రఫీ, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎన్ఆర్ఐ సంతోష్ బాబు, పంచాయతీ కార్యదర్శి రాజు, రాజమణి, వీఆర్వోలు భాస్కర్, రాజు, తదితరులు పాల్గొన్నారు