Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
జిల్లా కలెక్టర్, డీపీఓ ఆదేశాల మేరకు కమలాపురం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై డీఎల్పీఓ మంగళవారం విచారణ చేశారు. మండల పంచాయతీ అధికారి శ్రీకాంత్ బెహరా అధ్వర్యంలో డివిజనల్ పంచాయతి అధికారి విచారణ అధికారిగా హాజరై 2021 డిసెంబర్ 14 నుంచి గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల జమ, దుర్వినియోగంపై విచారణ చేశారు. ఈ విచారణకు గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శులు గుగులోతు చందూలాల్, కుర్ర చిరంజీవి, జంపల ఆంజనేయులు హాజరయ్యారు. విచారణలో భాస్కర్ మాజీ మండల పంచాయతి అధికారి హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేసినట్టు డీఎల్పీఓ తెలిపారు.