Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిందితులను కఠినంగా శిక్షించాలి
డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్
నవతెలంగాణ-కన్నాయిగూడెం
మండలంలోని చింతగూడెం గ్రామానికి చెందిన పేద దళిత సామాజిక వర్గానికి చెందిన గజ్జెల రామారావును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ డిమాండ్ చేశారు. మండలంలోని చింతగూడెం గ్రామంలోని రామారావు కుటుంబాన్ని మంగళ వారం ఆయన ఆధ్వర్యంలోని బృందం పరామర్శించింది. అనంతరం రాజేందర్ మాట్లాడారు. రామారావును ఈనెల 7న ఛత్తీస్ఘడ్ నుంచి వలస వచ్చిన బీసీ యాదవ కులానికి చెందిన గొల్ల జోగయ్య కొందరితో కలిసి హత్య చేశాడని తెలిపారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని, బాధిత కుటుంబంలో ఓకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని, డబుల్ బెడ్రూమ్ ఇంటితోపాటు మూడెకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని ప్రభు త్వాన్ని కోరారు. హత్యలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో తెలియాలంటే కేసును పారదర్శకంగా, వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫ్రంట్ హనుమకొండ జిల్లా ఇన్ఛార్జి కొమ్ముల కరుణాకర్, జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ తదితరులు పాల్గొన్నారు.