Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-మహబూబాబాద్
కోవిడ్ మొదటి డోస్ వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తి చేయడంలో వైద్యుల కృషి అభినందనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ నూరు సాధించి రాష్ట్రంలోనే 10వ స్థానం చేరుకున్న సందర్భంలో ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌజ్‌లో కలెక్టర్ శశాంక అధ్యక్షతన అభినందన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి అధికారులకు, డాక్టర్లకు అందించారు. అనంతరం మంత్రి మాట్లా డారు. రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతమన్నారు. అందులోనూ జిల్లాలోనే అత్యంత మారుమూల మండలాలైన కొత్తగూడ, గంగారం సిగల్ లేని ప్రాంతాలని చెప్పారు. అటువంటి ప్రాంతాల్లోనే ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్ చేసి నూరు శాతం సాధించడంతో వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు. తొలుత కోవిడ్ వచ్చినప్పుడు వైద్య సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నడిపించడంలో జిల్లాను ముందంజలో ఉంచుతూ నిరంతరం సమీక్షిస్తూ అధికారులను ప్రోత్సహిస్తూ నూరు శాతం పూర్తి చేయటంలో జిల్లా కలెక్టర్ శశాంక విజయ వంతమయ్యారని మంత్రి తెలిపారు. ఇదే స్ఫూర్తితో రెండవ డోసు నూరు శాతం పూర్తి చేయాలని చెప్పారు. రైతుల ధాన్యం తప్పనిసరిగా కొనుగోలు చేస్తామని, యాసంగిలో పండించే ధాన్యం ఎఫ్‌సీఐ కొనుగోలు చేయబోమని చెప్పినందున రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు చేపట్టి ఆర్థిక అభివృద్ధి సాధించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జిల్లాలో 18 ఏండ్లు దాటిన 5.65 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలి పారు. అలాగే రెండో డోసు 3.20 లక్షల మందికి వేసి 56 శాతంగా ఉన్నామన్నారు. ప్రణాళికాబద్ధంగా చేపట్టినందున విజయానికి చేరువవుతున్నామని తెలిపారు.కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్నామని నిర్లక్ష్యం తగదన్నారు. ఓమిక్రాన్ పొంచి ఉందని, మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని కోరారు. అనంతరం మంత్రి వైద్య సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు వెంకట్రాములు, టీఎన్జీఓల సంఘం జిల్లా నాయకుడు వడ్డెబోయిన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.