Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా కొవిడ్-19 టీకాల కార్యక్రమన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం వరంగల్, హను మకొండ జిల్లాల వైద్య అధికారుల అధ్యక్షతన జిల్లా వైద్య కార్యాలయంలో రెండు జిల్లాల వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు. ప్రజల్లోకి కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తున్నారని అన్నారు. మాతాశిశు సంరక్షణ సేవలు, సాధారణ ప్రసవాలను పెంచాలని అన్నారు. పన్నెండు వారాల్లోపు గర్భిణుల పేర్లు నమోదు చేసుకుని పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. 100శాతం చిన్నపిల్లల కు టీకాలు ఇవ్వాలని సూచించారు. పుట్టుకతో వచ్చే లోపాలు , రుగ్మతలను గుర్తించి వైద్య సేవలు అందజేయాలని ఆదేశిం చారు. స్క్రీనింగ్‌లో భాగంగా డయాబెటిస్ హైపర్‌టెన్షన్, క్యాన్సర్లను గుర్తించి పూర్తిస్థాయి చికిత్సలు అందజే యాలన్నారు. జిల్లాల్లో అనుమానిత టీబీ రోగులను గుర్తించి పూర్తిస్థాయి చికిత్స అందించాలన్నారు. వైద్య అధికారులు టెలీ కన్సల్టేషన్, పల్లె దావఖానాల ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హను మకొండ డీఎంహెచ్ఓలు కాజీపేట వెంకటరమణ, డాక్టర్, కె లలితాదేవి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు పాల్గొన్నారు.