Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
వరి ధాన్యం కొనుగోలు విషయం లో రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహిత మని టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కుడు పోరిక గోవిందనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడడారు. జిల్లావ్యాప్తం గా అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలి పారు. రైతులు సంతోషంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటు న్నారని చెప్పారు. సోషల్ మీడియాలో, పత్రికల్లో ప్రచారం కోసమే సీతక్క కొనుగోలు కేంద్రాలను సందర్శించి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సీతక్క తప్పుడు విధానాలు అవలంభిస్తోంందని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సీతక్క ఏమీ చేయలేదని, ఉనికి కోసమే ఊసరవెల్లి తరహాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ రైతుల పక్షాన పార్లమెంటులో పోరాడేలా చొరవ చూపాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అర్హత సీతక్కకు లేదన్నారు.