Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కొర్ర మేఘనసింధు అత్యంత ప్రతిభకనబర్చి జూనిర్ ఇంటర్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.సునిత తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో మేఘనసింధు 466/470 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కళాశాల పేరును నిలబెట్టడం అభినందనీయమన్నారు. అలాగే సీఈసీలో 459/500 సాధించిన బుర్ర రక్షిత, బైపీసీలో 364/440 సాధించిన బొంత సుస్మితను శాలువాతో సత్కరించారు. విద్యార్థి ప్రతిభకు కృషి చేసిన కళాశాల అధ్యాపక సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది బి.కుమార్; చాంప్లా, కొంరారెడ్డి, సదానందం, రఘురాం, కమలాదేవి, పద్మారాణి, సాయిప్రసాద్, సైదుల్లాసాహెబ్, సుమలత, మాధవి, సౌజన్య, వినరు, రంజిత్‌రెడ్డి, అనిత, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.