Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఆర్ఐ కళాశాల చైర్మన్ శోభారెడ్డి
నవతెలంగాణ-హసన్పర్తి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదువులో ఉన్నతంగా రాణించాలని ఎన్ఆర్ఐ కళాశాల చైర్మన్ శోభారెడ్డి అన్నారు. మండలంలోని ఎర్రగట్టుగుట్ట క్రాసురోడ్డు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శోభారెడ్డి, డైరెక్టర్ గట్టయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యలో ఉన్నతంగా రాణించినప్పుడు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి గొప్ప లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థుల, జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలికి స్నేహపూర్వక వాతావారణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాజుకుమార్, తదితరులు పాల్గొన్నారు.