Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలో మిర్చి తోటల్లో తామర పురుగు నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు ఏఓ చేరాలు, రైతు సేవా సహకార సంఘం చైర్మెన్ తోట రమేష్, ఉధ్యాన అధికారి వేణుమాధవ్ తెలిపారు. మండలంలోని కొత్త మల్లూరు, చుంచుపల్లి, వాడగూడెం గ్రామాల్లోని మిర్చి పంటలను గురువారం సందర్శించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. ప్రస్తుతం మిర్చిలో తామర పురుగు ఉధృతి ఉన్న క్రమంలో నివారణ కోసం వేపనూనె పది వేల పి.పి.యం రెండు మిల్లీ లీటర్లు లేదా 0.5 గ్రాముల సర్ఫ్ లేదా టైటాన్ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు కొడవలి రఘు, కొత్తపెల్లి శివరాం, కొత్తపెల్లి వెంకట్రావు, యలమాటి శ్రీనివాసరావు, బట్ట రామారావు, ఆదినారాయణ, రమేష్, వెంకటపతి, ఆంజనేయులు, రామకష్ణ, శ్రీను, కాకర్ల లక్ష్మీ ప్రసాద్, వైట్ల సాయిబాబు, వైట్ల శ్రీధర్, ఈడుపుగంటి నరసింహారావు, వాసం కష్ణ, తోలెం బాబురావు పాల్గొన్నారు.