Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ రూరల్
పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌ను విముక్తి చేయించేం దుకు జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం విజరు దివస్‌ను ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగజీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేమళ్ల రాజ నరసింహారెడ్డి, రవి, మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ కు విముక్తి కలిగించడం లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆ యుద్ధంలో విజయం సాధించిన అనంతరం అప్పటి విపక్ష నేత వాజ్‌పేయీ ఇందిరాగాంధీని దుర్గాదేవిగా కొనియాడిన విషయాన్ని ఇప్పటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చందన రెడ్డి, జిల్లా నాయకులు బడికె కష్ణస్వామి, అల్లం ప్రదీప్ రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు మాజీద్ మీడియా ఇంచార్జ్ పిట్టల సతీష్, బండారు శ్రీనివాస్, కూరాకుల నాగరాజు పాల్గొన్నారు.