Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
ఖానాపూరం మండలానికి చెందిన కన్నె రాజు వరంగల్లో కానిస్టేబుల్ గా పని చేసుకుంటూ యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో గురువారం రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో విజరు దివస్ సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు మెగా రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరం పోస్టర్ల ను ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్ ఆవిష్కరించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనుకున్న వారు కొత్తకొండ అరుణ్ కుమార్ 9666109108 , వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు( స్విమ్మర్ రాజు ) 9490115105 నెంబర్లలో సంప్రదించాలనానరు. ఈ కార్యక్రమంలో యువ నేతాజీ ఫౌండేషన్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, బొట్టు కమలాకర్, కైలాసపు సంతోష్ కుమార్ , మునిగాల రాము , అలువాల పథ్వి తదితరులు పాల్గొన్నారు.