Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
ప్రతిభను కనబరచాలని కషి పట్టుదల ఉన్నట్లయితే అంగవైకల్యం అడ్డు పేదరికం అడ్డుకాదని పేదరిక నిర్మూలన సంస్థ కమ్యూనిటీ కోఆర్డినేటర్ గోలి కొమురయ్య అన్నారు. గురువారం మండలంలోని ఇల్లంద గ్రామం లో తుంగభద్ర గ్రామ సంఘం అధ్యక్షురాలు అరుణ అధ్యక్షతన లో జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత మైదాం సరిత సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజ అభివద్ధి కోసం కృషి చేయాలనే పట్టుదల ఉంటే అంగవైకల్యం పేదరికం అడ్డుకాదని అన్నారు. ప్రతిభావంతురాలైన సరిత మహిళా సంఘం లీడర్ గా ఉండి ఉత్తమ మహిళా సంఘం లీడర్‌గా ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి మహిళ సరితను ఆదర్శంగా తీసుకో వాలని సూచించారు. వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణిం చాలని అన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షురాలు ఎడ్ల అరుణ కార్యదర్శి జోగుల అనూష వివో ఏలు తక్కలపెల్లి శోభ పద్మావతి రమ్య స్రవంతి మాజీ అధ్యక్షురాలు స్వప్న 25 సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.