Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
వ్యవసాయ గ్రేన్ మార్కెట్లో కోతుల బెడదతో రైతులు ఆందోళనకు గురౌతున్నారు. మార్కెట్కు అమ్మకానికి తీసు కొచ్చిన ధాన్యాన్ని కోతులు చిందరవందర చేస్తుండడంతో నానా తంటాలు పడుతున్నారు. కోతుల బెడద నుంచి ధాన్యాన్ని కాపాడుకొనేందుకు కంటి మీద కునుకు లేకుండా పోతోందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల స్వైరవిహారంతో నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. మార్కెట్ అధికారులు యార్డు లో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.
కోతుల బెడుద నుంచి కాపాడాలి
మేరుగు శివకోటి, జనసేన నియోజకవర్గ నాయకులు
మార్కెట్లో కోతుల బెడుద ఎక్కువై రైతులు నష్టపోతున్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకొస్తే సకాలంలో కొను గోలు చేయక, సరైన ధర రాకా ఇబ్బందులు పడు తున్నారు. దీనికి తోడు కోతుల స్వైర విహారం వల్ల మరింతగా నష్టపోవాల్సి వస్తుంది. మార్కెట్ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలి.