Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్బెల్ట్
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసి టు గనిలో భూపాలపల్లి రెస్క్యూ స్టేషన్ మేనేజర్ రవీందర్ ఆధ్వర్యంలో గురువారం ప్రథమ చికిత్స పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సేఫ్టీ జనరల్ మేనేజర్( కార్పొరేట్) కే. గురవయ్య, ఏరియా జనరల్ మేనేజర్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సింగరేణి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ పక్షోత్సవాలు లో భాగంగా ప్రమాదానికి గురైన వారికి అత్యవసర పరిస్థితులలో అందించే ప్రాథమిక చికిత్స పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓసి టు ప్రాజెక్టు మేనేజర్ జాన్ ఆనంద్, మేనేజర్ బిక్షమయ్య, సేఫ్టీ ఆఫీసర్ రాంబాబు ,సభ్యులు గుర్రం మహేంద్ర, జలపతి ,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.