Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవలాల్ సేన జిల్లా అధ్యక్షుడు సంతోష్‌నాయక్
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన నంగవత్ రాజేష్ నాయక్‌కు ట్రైకార్ చైర్మెన్ గానీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి గానీ ఇవ్వాలని సేవాలాల్ సెన జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సంతోష్‌నాయక్ కోరారు. గురు వారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడారు. గిరిజన బిడ్డ, ఉద్యమ కారుడు అయిన జయశంకర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నంగవత్ రాజేష్‌నాయక్‌ను ప్రభుత్వం గుర్తించి ఎస్టీ సామాజిక వర్గం నుంచి కాళీ అయిన రాములు నాయక్ ఎమ్మెల్సీ పదవిని రాజేష్‌నాయక్‌కు ఇవ్వాలని గతంలో డిమాండ్ చేసామన్నారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన రాజేష్‌నాయక్‌ను గుర్తించి నామినేటెడ్ పదవి ఇవ్వా లన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన నాయకులు వాలు నాయక్, రాజునాయక్, శేఖర్‌నాయక్, సందీప్ నాయక్, రాకేష్ నాయక్, మధుకర్ నాయక్ పాల్గొన్నారు