Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
యువత తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఏకగ్రతతో చదవాల్సి వుంటుందని సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి అన్నారు. వరంగల్ కమిషనరేట్ అధ్వర్యంలో గురువారం నుండి హన్మకొండ డివిజన్ వి-ఫిజిక్స్ సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ శిక్షణ తరగతులను గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ సబ్-ఇన్స్‌స్పెక్టర్, కానిస్టేబుళ్ళ నియామాకాల్లో ఆర్థికంగా వెనుకబడిన యువత రాణించాలనే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఆలోచన మేరకు గత కొద్ది రోజుల క్రితం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించిన అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డివిజన్ పరిదిలో ఉచిత శిక్షణ అందజేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా హన్మకొండ డివిజన్ పరిధిలో ఎంపిక కాబడిన 200 మంది అభ్యర్థులకు 80రోజుల పాటు పోటీ పరీక్షల్లో అంశాలతో పాటు వివిధ పాఠ్యాంశాల్లో నిపుణులైన అధ్యాపకులచే శిక్షణ అందజేయడం జరుగుతుందన్నారు. త్వరలో పోలీస్ నియామాకాలకు సంబంధించి ప్రకటన విడుదల అవుతుందన్నారు. దీన్ని దష్టిలో వుంచుకోని ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేెయడం జరిగిందన్నారు. ప్రకటన వెలుబడిన సమయానికి 60 శాతం సిలబస్ పూర్తి చేసుకొని పరీక్షకు సిద్దం కావచ్చన్నారు. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు ఇంటికి వెళ్ళిన శిక్షణ తరగతుల్లో నేర్పిన పాఠ్యాంశాలను మరోమారు తిరిగి చదువుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గోనే అభ్యర్థులు తప్పని సరిగా సెల్ ఫోన్‌కు దూరంగా వుండటం ద్వారా పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఆవకాశాలు పెరుగుతాయన్నారు. యువత తమ సమయాన్ని వధా చేయకుండా కఠోర సాధన చేయడం అనుకున్న ఉద్యోగాలను సాధింగలరన్నారు. అభ్యర్థులు శిక్షణ సమయంలో సిలబస్ పై ఎలాంటి అనుమానాలు ఉన్నా వాటిని తక్షణమే నివృత్తి చేసుకోవాలన్నారు. లా అండ్ ఆర్థర్, ట్రాఫిక్ అదనపు డీసీపీ సాయి చైతన్య మాట్లాడుతూ అనుకున్న సంకల్పం కోసం ఎలాంటి అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి యువత తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. పోటీ పరీక్షల కోసం ప్రణాళికాబద్దంగా చదివితే సర్కారు కొలువులు సొంతం అవుతాయన్నారు. అదనపు డీసీపీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సీటీ రిజిస్ట్రార్ వెంకట్రామ్రెడ్డి,హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, హన్మకొండ, సుబేదారీ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్లు వేణుమాదవ్, రాఘవేందర్, సతీష్, కేయూ ఎస్సైలు సతీశ్, రాజ్ కుమార్, పీజేఆర్ డైరక్టర్ జనార్థన్‌రెడ్డితో ఇతర పోలీస్ సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.