Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో సభ్యత్వ నమోదు
నవతెలంగాణ-ఏటూరునాగారం
కాంగ్రెస్ శ్రేణుల కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా అధిష్టానం ఆలోచిస్తోందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు తెలిపారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో సభ్యత్వ నమోదుకు సంబంధించి ఎన్రోలర్లకు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం వెంకన్న, అయూబ్ ఖాన్, రఘు మాట్లాడారు. డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని సూచించారు. సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు, నాయకులకు రూ.2 లక్షల బీమా సదుపాయం ఉంటుందని తెలిపారు. తద్వారా కుటుంబాలకు రక్షణ లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ వావిలాల నర్సింగరావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, మండల ఉపాధ్యక్షుడు రియాజ్ జియా, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చేల వినరు, మండల నాయకులు చింత రమేష్, ఈసం జనార్ధన్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్, ముక్కెర లాలయ్యా, పెద్దబోయిన నర్సింగరావు, తల్లపల్లి నరేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : మండలంలోని బేరువాడలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అంబటి మహేందర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు దస్రూనాయక్, సింగిల్ విండో చైర్మెన్ బండారు వెంకన్న, ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు బాలునాయక్, సర్పంచ్ ముదిగిరి సాంబయ్య, బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు చిరగని సారయ్య, తదితరులు పాల్గొన్నారు.