Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెహర్ రంగా 35 ఎంఎం యజమాని
నవతెలంగాణ-గోవిందరావుపేట
గ్రామీణ ప్రాంతాల్లో సినిమా టికెట్ ధర సామా న్యునికి అనుకూలంగా ఉండాలని, పెంచడం ఇష్టం లేకనే థియేటర్ను నడిపించడం లేదని మెహర్ రంగా 35 ఎంఎం యాజమాని కాట్రగడ్డ సతీష్ బాబు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అఖండ, పుష్ప తదితర సినిమాలను ప్రదర్శించకపోవడానికి టికెట్ల ధరలే ప్రధాన కారణమన్నారు. ప్రజలకు అర్థం చేయించేలా థియేటర్ ఎదుట బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు ఏకఛత్రాధిపత్యంతో వందల కోట్లు పెట్టి రాబోయే 8 నెలలు సినిమాలు మొత్తం గంపగుత్తగా కొనేసి మార్కెట్లో పోటీ లేకుండా సినిమా టికెట్ల ధరలను ఇష్టారాజ్యంగా పెంచి ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇక్కడి థియేటర్లు రూ.70ల టిక్కెట్టుతో గతంలో నిర్వహించామని, ఇప్పుడు వంద రూపాయలకు పెంచాలని ఒత్తిడి చేస్తున్న క్రమంలో ఆ ఒత్తిడిని అంగీకరించకుండా సినిమాలు నిర్వహిం చడం లేదన్నారు. ఇకపై వెంకటేశ్వర ఫిలిమ్స్ (దిల్ రాజ్) ఆధ్వర్యంలో వచ్చే సినిమాలను తమ థియే టర్లు ప్రదర్శించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. 45 ఏండ్ల అనుభవంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని పరితపించామని చెప్పారు. ఏనాడు టిక్కెట్ ధరలను పెంచి లాభాలు గడించా లని ఆలోచించలేదని తెలిపారు. ప్రేక్షకులు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు.