Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
నగరంలోని రెడ్డిపురం విజయలక్ష్మి కాలనీలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఎస్టీపీ హండ్రెడ్ ఎల్ఎండీ మురికినీటి శుద్ధికరణ ప్లాంటును తరలించాలని బీజేపీ రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. విజయలక్ష్మీ కాలనీలో ఏర్పాటు చేయుటకు మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నారని రైతులు, ప్లాట్ల యజమానులు, కాలనీవాసులు గురువారం విజయలక్ష్మి రోడ్ 02 దగ్గర నిరాహార దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాకేష్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో వరంగల్ రెండో అతిపెద్ద నగరం కాగా నగరంలో కూత వేటు దూరంలో ఉన్న రెడ్డిపురంలో ఇప్పుడిప్పుడే అభివద్ధి చెందుతూ వందల మంది ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నరన్నారు. ఈ కాలనీలో అధికారులు మురికినీటి ప్లాంటును ఏర్పాటు చేయుటకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిన రైతులు, ప్లాట్ల యజమానులు, కాలనీ వాసులు ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్‌ను స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీగా గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. నగరంలో జనాభా ఎక్కువ అవుతున్నారు కనుక మురికి నీటి శుద్ధీకరణ ప్లాంట్ నగరానికి కావలసిందే కానీ జనావాసాల మధ్య నగరానికి దగ్గరలో ఉండే ఈ ప్రాంతంలో పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్లాంట్‌ను రెడ్డిపురం నుండి తరలించి జనాలకు ఇబ్బంది కాకుండా నగరం చివరలో ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ రైతులు పండించిన పంట పైన ఆధారపడి బతుకుతున్నరన్నారు. కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేసి రైతుల జీవితాలను కాపాడాలన్నారు. ప్లాంటూను ఇక్కడ నుండి తరలించకుంటే రైతులకు, కాలనీ వాసులకు న్యాయం జరిగే విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. అలాగే సమస్య పరిష్కారం కాకుంటే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదుట న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే అధికారులు, ప్రజా ప్రతి నిధులు స్పందించి రైతులకు, కాలనీ వాసులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లావుడ్య రవినాయక్, బొంగు అశోక్‌యాదవ్, పసుల సంజీవ్, పసుల వివేక్, రైతులు,పాట్ల యజమానులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.