Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి గల అవకాశాలు, వీసా, తదితర అంశాలపై ఈనెల 19న వరంగల్‌లో సదస్సును నిర్వహిస్తున్నట్లు ఫ్లై హై ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఫౌండర్, సిఇఓ వీరగోని యశ్పాల్ తెలిపారు. గురువారం హన్మకొండ హరిత కాకతీయ హౌటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశ్పాల్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించా లంటే రూ.40-రూ.50 లక్షలు ఖర్చవుతాయనే ప్రచారం జరుగుతుందని, రూ.14-రూ.15 లక్షలతో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించవచ్చన్నారు. వీసా తీసుకోవడంలో, యూనివర్సిటీలను ఎంచుకోవడంలో వచ్చే సమస్యలపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ఈనెల 19న హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో మధ్యాహ్నాం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐపిఎస్ అధికారి వివి. లక్ష్మీనారాయణ, వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పాల్గొంటారని తెలిపారు.