Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ పర్యటన వాయిదా !, మళ్ళీ ఎప్పుడో !
నవతెలంగాణ-జనగామ
జనగామ జేఏసీ పవర్ ఏంటో మరోసారి రుజు వైంది. గతంలోనే జనగామ జిల్లా సమీకత కార్యాల యాలను ప్రారంభోత్సం చేస్తామని జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ జిల్లా కార్యా లయాలను ప్రారంభిస్తారని భనవ నిర్మాణ పనులను వేగవతం చేయడమే కాకుండా, గార్డెనింగ్ పనులు, మిగులు పనులను పూర్తి చేశారు. కానీ సీఎం కేసీఆర్ రాలేదు. తిరిగి ఈనెల 20 జనగామ జిల్లా పర్యటన షెడ్యూల్ను నిర్ణయించుకున్నారు. ఈమేరకు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. దీనిలో భాగంగా గత రెండు రోజులుగా దయాకర్రావు సీఎం సభ విజయవంతం కోసం విస్తతంగా పర్యటిస్తూ జనస మీకరణకు బాధ్యులను నియమించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా జిల్లాలోని మంత్రి సత్యవతిరాధోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రకాలైన ప్రజాప్రతి నిధులతో సమీక్ష సమావేశం కూడా ఎర్రబెల్లి నిర్వ హించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవ రుప్పుల మండలాల్లో జన సమీకరణ కోసం సమావేశాలు నిర్వహించారు. జనగామ జిల్లా కలెక్టరెట్ భవన సము దాయ ప్రారంభోత్సవంకు మూహూర్తం ఖారరైంది.. గురువారం మంత్రి ఎర్రబెల్లి జిల్లా కలెక్టరెట్ భవనంను, తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్ని సంద ర్శించి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలిం గయ్య, జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి సత్యవతిరాధోడ్, మానుకోట, వరంగల్ ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, వరం గల్ పోలీస్ కమీషనర్ తరుణ్జోషీ కూడా సందర్శించి ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు పరిశీలించారు. ఏర్పాట్లు చేస్తుండటంతో ప్రజలకు అన్ని జిల్లా కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని ఆశించారు. కానీ చావు కబురు చల్లగా చెప్పినట్లుగా సీఎం కేసీఆర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనగామ జిల్లా ప్రజలు ఊసురుమన్నారు.
జేఏసీ ఆల్టీమేటమ్కు జడుసుకున్న సీఎం..
జనగామ జేఏసీ అంటే ఎందుకో కేసీఆర్ ప్రతిసారి జడుసుకుంటున్నట్లే అనిపిస్తుంది. గతంలో జనగామ జిల్లా ఏర్పాటు చేయకపోవడంతో జనగామ ప్రజలు జిల్లా సాధన సమితి పేరుతో ప్రత్యేక జేఏసీని ఏర్పాటు చేసి ధీర్ఘకాలిక పోరాటం చేశారు. దీంతో కేసీఆర్ దిగిరాక తప్పలేదు. దీంతో చివరికి కేసీఆర్ జనగామ జిల్లా ఏర్పాటు చేయక తప్పలేదు. దీంతో పాటు జేఏసీ పోరాట ఫలితంగా జిల్లా ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాకు మెడికల్ కాలేజ్తో పాటు అనేక హామీలను ఇచ్చారు కేసీఆర్. అయితే ఏ ఒక్క హామీ కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదు. జనగామ జిల్లా పైనే సీఎం కేసీఆర్ శీతకన్నేశారు. దీంతో జనగామ జిల్లా అభివద్ధి కి నోచు కోలేదు. దీంతో జనగామ జిల్లా ప్రజలు, జిల్లా సాధన సమితి సభ్యులు ఆగ్రహంగానే ఉన్నారు. అయితే గతంలో జిల్లా కలెక్టరెట్ ప్రారంభోత్సవంకు కేసీఆర్ వస్తానని జిల్లా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. వస్తారని మంత్రి ఎర్రబెల్లి కూడా ప్రకటించారు. అప్పుడే జనగామ జేఏసీ నేతలు జనగామకు ఇచ్చిన హామీలను అమలు చేశాకే జనగామకు రావాలని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో కేసీఆర్ పర్యటన ఖరారు చేయలేదు. ఇక ఇప్పుడు ఈనెల 20న సీఎం వస్తున్నట్లు ప్రకటించారు. మం త్రులు కూడా ఏర్పాటు చురుకుగా చేస్తున్నరు. పర్యటన ఖరారు అయింది. దీంతో జేఏసీ గత హామీలను నెరవేర్చాలని, లేకుంటే కేసీఆర్ వస్తున్న 20న జనగామ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. దీంతో కేసీఆర్ మరో మారు జనగామ జిల్లా పర్యటనను వాయిదా వేస్తుకు న్నారు. జేఏసీ బంద్కు పిలుపునివ్వడం, కేసీఆర్ పర్య టనను వాయిదా వేసుకోవడంతో జనగామ కలెక్టరేట్ భవనంకు ప్రారంభమయ్యే యోగం లేదేమోనని ప్రజలు అనుకుంటున్నారు.
మళ్ళీ ఎప్పుడో ?
ఈ నెల డిసెంబర్ 20 న జనగామ సమీకత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(సమీకత కలెక్టరేట్ కార్యాలయం), టీఆర్ఎస్ జిల్లా కార్యాల యాలు ప్రారంభోత్సవాలు వాయిదా వేసినట్టు అధికా ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. దీంతో జనగామ జిల్లా కలెక్టరేట్, టీఆర్ఎస్ భవనాలు ప్రారం భోత్సవానికి నోచుకోని పరిస్థితి దాపురించింది. ఈ రెండు కార్యాలయాలు ఎప్పుడు ప్రారంభోత్సవాలకు నోచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది.