Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
మేడారం అభివద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలు లో శుక్రవారం జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య మేడారం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మేడారంలో అన్ని పనులకు టెండర్లు పూర్తి అయి పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ పనులు నిర్మాణంలో గ్రౌండింగ్ ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి పనులను పరిశీలించాలని సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యమైన ప్రమాణాలను పరిశీలించాలని, లొకేషన్స్ వారిగా బ్యాటరీ టాప్ లు ఉన్నాయా , ఎలక్ట్రిసిటీ పోల్స్ లోకేషన్స్ వారిగా ఉన్నాయా లేదా అనేదాని దగ్గరుండి చూసుకోవాలని అన్నారు. డ్రింకింగ్ వాటర్,టాయిలెట్స్ వద్ద నాలుగు లైట్స్ తప్పనిసరి గా ఉండాలని, పార్కింగ్ ఏరియాలో లైటింగ్ ఉండేలా చూసుకోవాలని అన్నారు. అందుకు గాను ఏ. ఇ %తీషర% అధికారులు,ఇరిగేషన్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులతో టీమ్ వారిగా వెళ్లి పనులు పర్యవేక్షించాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.