Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు విస్తతస్థాయి సమావేశం
నవతెలంగాణ-తొర్రూరు
పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఆ పార్టీ పెద్దవంగర మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య తెలిపారు. ఆ మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు ఈదురు వెంకన్నకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.37 వేల 500ల చెక్కును ఐలయ్య శుక్రవారం అందించి మాట్లాడారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ నుంచి ప్రభుత్వం సాయం అందిస్తోందని తెలిపారు. ఈనెల 18న తొర్రూరులోని ఎల్వైఆర్ గార్డెన్లో పార్టీ పెద్దవంగర మండల విస్తతస్థాయి సమావేశం ఉంటుం దని చెప్పారు. మండలంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ ఈదురు లచ్చమ్మ, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కొల్లూరు రమేష్, గ్రామ కార్యదర్శి వల్లపు పరమేష్, ఉపాధ్యక్షుడు మొగులగాని హరీష్, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఆవుల సోమన్న, వార్డ్ సభ్యులు ఆవుల వసంత కొమురెల్లి, రాపోలు అన్నపూర్ణ సుదర్శన్, గౌడ సంఘం అధ్యక్షుడు రాయపల్లి సత్యనారాయణ, కోతి రాజు, మత్స్యశాఖ మాజీ అధ్యక్షుడు పిట్టల వెంకటేశ్వర్లు, పాక చిన్న రాములు, ఈదురు రాములు, సైదులు, కట్కూరి సోమలింగం, పోతుగంటి శ్రీశైలం, వల్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.